UPSC Civil Service Exam 2025 ప్రిమిల్స్ లో లోతైన ప్రశ్నలా… | UPSC 2025

UPSC Civil Service Exam 2025 ప్రిమిల్స్ లో లోతైన ప్రశ్నలా…

హలో ఫ్రెండ్స్… UPSC Civil Service Exam 2025  ఏటా అభ్యర్థులను ఆశ్చర్యపరుస్తుంటుంది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ 2025 ప్రశ్నల అరేంజ్మెంట్ కూడా ఎంతో మంది  అభ్యర్థులను ఆశ్చర్యపరిచింది. ప్రశ్నల విధానం, సమాధానాల ప్రత్యామ్నాయాలు తికమక గా ఉండడం తో, చాలామంది కి ప్రశ్నా పత్రం కఠినంగా అనిపించింది. ఈ పరీక్ష విధానంలో విశ్లేషణ.. రేపటి సివిల్ అభ్యర్థుల నన్నద్ధతకు దిక్సూచి.

UPSC Civil Service Exam 2025 కి సంబందించిన నోటిఫికేషన్ జనవరి లో విడుదల చేశారు. దీనికి సంబందించిన అప్లికేషన్ ప్రక్రియను జనవరి 22 మొదలు, చివరి తేదీ ఫిబ్రవరి 21న ముగిసింది మరియు UPSC Civil Service Exam 2025 సంబంధించిన అప్లికేషన్ మార్పులు ఫిబ్రవరి 22 నుండి ఫిబ్రవరి 28 వరకూ గడువిచ్చారు. ఈ పరీక్షను నేషన్ లెవెల్ లో నిర్వహిస్తారు. ఆయితే UPSC Civil Service Exam ను ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఈ  పరీక్షలలో  ఉత్తీర్ణత సాధించిన వారిని సెంట్రల్ గవర్నమెంటు సర్వీసెస్ అయిన ఐఏఎస్, ఐపిఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్  తదితర భాగాల్లో రిక్రూట్ చేసుకుంటారు. ఈ  పరీక్షను హిందీ మరియు ఇంగ్లీష్ రెండు భాషలలో నిర్వహిస్తారు. ఆయితే ఈ సంవత్సరం మొత్తం 979 వేకెన్సీ స్ వివిధ  భాగాల్లో పోస్టులు ప్రకటించారు.

Follow for more Daily Updates

Prelims Paper Analysis

ఆయితే UPSC Civil Service Exam 2025 ప్రిలిప్స్ పరీక్షకు సంబందించిన ఎడ్మిట్ కార్డును మే 13న విడుదల చేశారు. ఆయితే UPSC Civil Service Exam 2025 ప్రిలిమ్స్ పరీక్షను మే 25న నిర్వహించారు. ఆయితే ఈ పరీక్షకు సంబందించిన ప్రశ్నా పత్రం గురించి ఇప్పుడు చూద్దాం.

సివిల్ సర్వీసెస్  పరీక్షకు అఖిలభారత స్థాయిలో అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి.  ఇది పరీక్షకు పెరిగిన డిమాండ్ ను సూచిస్తుంది. గత పది సంవత్సరాల పరంగా చూస్తే…సంఖ్య రెట్టింపు అయింది. ఆయితే ప్రతి సంవత్సరం అభ్యర్థుల సంఖ్య పెరుగుతూనే ఉన్నారు. ఆయితే ఇది ఫ్యూచర్ లో కనిపించే పోటి తీవ్రతను సూచిస్తోంది. 

అయితే 2024తో పోలిస్తే… రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభ్యర్థుల సంఖ్య తగ్గింది. 2024లో 79,043 మంది ఉండగా… 2025లో ఆ సంఖ్య 74,427 మంది మాత్రమే. గత సంవత్సరం 53% మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ ఏడాది 74,427 మంది అభ్యర్థుల్లో 42,804 మంది పరీక్షకు హాజరు కావడంతో 57 శాతానికి పెరిగింది. పరీక్షను సీరియస్ గా తీసుకునివాళ్ళు దరఖాస్తు చేయలేదు. సీరియస్ గా తీసుకునే వాళ్ళు పెరుగుతున్నారు. ఎక్కువమంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కావడం మంచి పరిణామం.

2023లో ప్రిలిమినరీ పరీక్ష పేపర్ 1 లో ప్రశ్నలు చాలా కఠినంగా ఉన్నాయన్నారు పరీక్ష రాసిన అభ్యర్థులు. దీనితో యుపిఎస్సి 2024 ప్రశ్నపత్రాన్ని కాస్త సరళంగా ఇచ్చింది. ఈ సంవత్సరం  మాత్రం 2023 లో ఇచ్చినట్లు కఠినంగా అనిపించింది అని చాలా మంది భావిస్తున్నారు. ప్రత్యామ్నాయ సమాధానాలు తికమకగా ఉన్నాయనేది ఎక్కువమంది ఫిర్యాదు. మధ్యాహ్నం పూట జరిగిన సీశాట్ పరీక్ష కూడా కఠినంగానే ఉంది. 

UPSC Civil Service Exam 2025 కి సంబందించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు జూన్ రెండో వారంలో రావచ్చు. ప్రిలిమ్స్  పరీక్షలో దేశవ్యాప్తంగా 12,750 నుండి 12,900 మంది వరకు అర్హతను బాధించవచ్చు.

UPSC Civil Service Exam 2025

 ఈ  సంవత్సరం ఏ ఏ విభాగాలలో ఎన్ని ప్రశ్నలు వచ్చారంటే?

కరంట్ అఫైర్స్ నుంచి 12 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ నుంచి ఐదు ప్రశ్నలు, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్ నుండి 16 ప్రశ్నలు, ఇండియన్ పాలిటీ అండ గవర్నెన్స్ నుంచి 16 ప్రశ్నలు, జనరల్ సైన్స్ నుంచి తొమ్మిది ప్రశ్నలు, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ నుండి 15 ప్రశ్నలు, ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీ నుండి 14 ప్రశ్నలు మరియు ఎన్విరాన్ మెంటల్ ఎకాలజీ నుండి 13 ప్రశ్నలు ఈ  విధంగా మొత్తం 100 ప్రశ్నలను UPSC Civil Service Exam 2025 ప్రిలిమ్స్ ప్రశ్న పత్రాన్ని తాయారు చేశారు.

After Prelims Exam

  • పరీక్ష బాగా రాసిన వాళ్లు సమయాన్ని వృధా చేయకండి. ఇప్పుడే మెయిన్స్ కు సంబందించిన ప్రిపరేషను మొదలు పెట్టాలి. అనుకూల మైన ఫలితాలు వచ్చేంతవరకు ఎదురుచూడాల్సిన అనవసరం లేదు. ఒక వారానికి మించి గ్యాప్ తీసుకోకండి. మెయిన్స్ కు సంబంధించిన  ప్రిపరేషన్ను వీలైనంత త్వరగా మొదలు పెట్టండి.
  • ఆప్షనల్ తో ప్రిపరేషన్ ఆరంభించాలి. ప్రిలిమ్స్ ముందు దీన్ని చదవడం ఆపేసివుంటారు. ఫలితాలు తర్వాత జూన్ నెల అంతా ఇతర పేపర్ల కోర్ అంశాల పై ఫోకస్ పెట్టాలి. జులై నెల నుండి అన్ని పేపర్లకి సమానంగా టైంని కేటాయించుకుని, రోజు రావడం ప్రాక్టీస్ చేయాలి. 
  • ఒకవేళ కటాఫ్ కంటే తక్కువ మార్కులు రావచ్చని, ఈ సంవత్సరం అర్హతను సాధించలేమని నిరాశ పడవద్దు. మొదటి ప్రయత్నంలో చాలామంది కి  ఇలాగే జరుగుతూ ఉంటుంది. అయిన కాని మీ ప్రిపరేషన్ ను కొనసాగించండి. మీకు అర్హత ఉన్న అన్ని పరీక్షలకు హాజరవ్వండి.
  • ఎక్కడ తప్పు చేశార ఒకసారి గుర్తించండి. అదే విధంగా తగిన పరిజ్ఞానం లేకపోవడం వలనా, అతి విశ్వాసంతోనా? లేక పరిక్ష హాల్లో తప్పులు చేయడం వలనా, పొరపాట్లను గుర్తించి వాటిని సరిదిద్దుకునే విధంగా తాగిన చర్యలు తీసుకోండి.
  • ఏడాది మాత్రమే సమయం ఉంది. అందుకని త్వరపడి ఏదో ఓ ఉద్యోగంలో చేరకండి. అలా చేయడం వల్ల లక్ష్యానికి దూరమవుతారు. ఉద్యోగం చేస్తూనే  చదువుకోవచ్చు అనుకోవడం తేలిక. వాస్తవంగా అది సాధ్యంకాదు. ప్రైవేట్ ఉద్యోగంలో చేరితే సమయం, శక్తి కూడా సరిపోదు. ఒకసారి ఉద్యోగంలో చేరితే ఇక దాన్ని వదిలిపెట్టి బయటకు రావడం మానసికంగా కష్టమవచ్చు.
  • మెయిన్స్ పరీక్ష రాస్తాననే ఉద్దేశంతో టైమ్ టేబుల్ వేసుకుని ప్రిపేర్ అవ్వండి. దీన్ని మీరు సాధిస్తే, వచ్చే ఏడాది తప్పకుండా పరీక్ష సాధిస్తారు.
Follow for more Daily Updates
SSC 2025 Job Calendar

Important Note:

ఫ్రెండ్స్ మన website అయిన Daily Updates లో ప్రతిరోజూ ముఖ్యమైన Job and Educational Updates ఇస్తాం. కావున ప్రతి ఒక్కరు మన website ని రోజు Visit చేసి మీకు అర్హతలు ఉన్న Jobs మరియు Education కి సంబంధించిన వాటి గురించి తెలుసుకొని Apply చేసుకోండి.

1 thought on “UPSC Civil Service Exam 2025 ప్రిమిల్స్ లో లోతైన ప్రశ్నలా… | UPSC 2025”

Leave a Comment

error: Content is protected !!