Jee Advanced Josa Counselling 2025 పూర్తి ప్రాసెస్ గురించి తెలుసుకుందాం…
హలో ఫ్రెండ్స్….జేఈఈ అడ్వాన్స్ కి సంబందించిన రిజల్ట్స్ నిన్న విడుదల చేశారు. Jee Advanced Josa Counselling 2025 నిన్ను సాయంత్రం నుండి ప్రారంభమైంది.
జాతీయ స్థాయిలో ప్రముఖ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లో ఉమ్మడి ప్రవేశాల కోసం కేంద్ర విద్యాశాఖ మంత్రిగారు ‘ ద జాయింట్ సీటు అలొకేషన్ అథారిటీ’(Josa Counselling)ని ఏర్పాటు చేసింది. 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి దేశ వ్యాప్తంగా 128 ఇన్స్టిట్యూట్ లో ప్రవేశాలకు Jee Advanced Josa Counselling 2025 నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేశారు. దీని ద్వారా ఐఐటిలు, ఎన్ఐటీలు, ఐఐఈఎస్ టి షిబ్ పూర్, ట్రిపుల్ ఐటీలు, ఇతర గవర్నమెంట్ ఫండెడ్ టెక్నిక్ ఇన్స్టిట్యూట్స్ (జీఎఫ్ టీఐ) ల్లో బీఈ లేదా బీటెక్,బీఎస్, బిఆర్క్, బీప్లానింగ్ కోర్సు లో ప్రవేశాలు కల్పిస్తారు.
జోసా లో పాల్గొనే ఇన్స్టిట్యూట్లు
Jee Advanced Josa Counselling 2025 లో పాల్గొనే ఇన్స్టిట్యూట్ లు, కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నా 23 ఐఐటీలు, 32 ఎన్ఐటీలు, ఐఐఈఎస్ టి షిబ్ పూర్, 26 ట్రిపుల్ ఐటీలు, 47 ఇతర గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ ల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆన్ లైన్ ఛాయిస్ ఫీలింగ్ ప్రక్రియ జూన్ 3వ తేదీ నుండి 12 వ తేదీ వరకు 9 రోజులు పాటు కొనసాగుతోంది. 6 రౌండ్స్ లో ఈ Jee Advanced Josa Counselling 2025 నిర్వహిస్తారు, ఈ 6 రౌండ్ల తర్వాత కూడా సీట్లు మిగిలిపోతే సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డ్(సీఎస్ఏబీ)… నిట్ లు, ట్రిపుల్ ఐటీలు, ఇతర జీఎఫ్ టీఐల్లో సీట్ల భర్తీకి రెండు ప్రత్యేక రౌండ్లు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
Follow for more Daily Updates
జోసాలో పాల్గొనేందుకు
ఐఐటిల్లో అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ 2025 లో అర్హత సాధించడంతో పాటు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో 10+2 లో కనీసం 75% మార్కులు పొందాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు 10+2లో కనీసం 65% మార్కులు వచ్చి ఉండాలి. దీంతోపాటు 10+2 స్థాయి బోర్డు పరీక్షల్లో టాప్ 20% లో ఉండాలి.
ప్రముఖ ఇన్స్టిట్యూట్ లో ప్రవేశాలు పొందేందుకు జేఈఈ మెయిన్స్ బీఈ/బీటెక్ పేపర్ పరీక్షలో అర్హత సాధించాలి, అలాగే బిఆర్క్ లేదా బీప్లానింగ్ లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్స్ బిఆర్క/బీప్లానింగ్ పేపర్ పరీక్షలో అర్హత సాధించాలి.
ఆయితే ఈ ప్రముఖ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యేందుకు Jee Advanced Josa Counselling 2025 వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి.
ఛాయస్ ఫిల్లింగ్, లాకింగ్
- Jee Advanced Josa Counselling 2025 లో పాల్గొనే విద్యార్దులు తప్పనిసరిగా ఆ పోర్టల్ లో నమోదు చేసుకోవాలి.
- దానికోసం జేఈఈ మెయిన్స్ 2025 కి హాజరైన అభ్యర్థులు వెబ్సైట్లో తమ దరఖాస్తు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాలి. అలా లాగిన్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ ఛాయిస్ ఫీలింగ్, ఛాయిస్ లాకింగ్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి.
- అయితే ఈ జోసా పోర్టల్ లో ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కి ఛాయిస్ ఫిల్లింగ్ కు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
- జోసా ద్వారా సీటు పొందేందుకు 2025, జూన్3 నుంచి 12వ తేదీ మధ్య లో జోసా వెబ్ సీట్లో ఆన్ లైన్ రిజిస్ట్రేషన్, ఛాయిస్ ఫీల్లింగ్ ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరిగా అవసరం.
- జూన్ 12వ తేదీలోపు విద్యార్థులు తమ అర్హతలు ఆసక్తికి తగ్గ ప్రోగ్రామ్స్ ను, అదే విధంగా ఇన్స్టిట్యూట్లను తమ ప్రాథమ్యాలుగా పేర్కొంటూ ఛాయిస్ ఫిల్లింగ్ ప్రక్రియ ను అత్యంత అప్రమత్తంగా పూర్తి చేయాలి. ఛాయిస్ ఫిల్లింగ్ గడువుపూర్తవక ముందే అభ్యర్థులు తమ ఛాయస్లను లాక్ చేసుకోవాలి లేకుంటే చివరగా సేవ్ చేసిన ఆప్షన్స్ ఆటోమేటిగ్గా లాక్ అవుతాయి. ఇలా ఒకసారి లాక్ చేసినా తరువాత మళ్ళీ ఎటువంటి మార్పులు చేయడానికి ఆవకాశం ఉండదు.
ఆన్లైన్ రిపోర్టింగ్
ఛాయిస్ ఫిల్లింగ్, లాకింగ్ చేసిన అభ్యర్థులు జోసా పోర్టల్ లో లాగిన్ అయి ఎప్పటికప్పుడు తమ సీటు కేటాయింపు వివరాలని తెలుసుకోవాల్సి ఉంటుంది, సీటు అలాట్మెంట్ గురించి అభ్యర్థులకు వ్యక్తిగతంగా ఎలాంటి సమాచారం ఉండదు.
సీటు అలాట్మెంట్ పొందిన విద్యార్థులు సీట పొందేందుకు నిర్దేశిత గడువు తేదీలోపు ఆన్లైన్ రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఆన్లైన్ రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయకుంటే సీటు రాద్దవడమే కాకుండా నెక్స్ట్ రౌండ్ కౌన్సిలింగ్ లో పాల్గొనే అవకాశం కూడా కోల్పోతారు.
ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్
సీటు అలాట్మెంట్ పొందిన అభ్యర్థులు మొదటి ఇనీషియల్ సీటు అలాట్మెంట్ ఇంటిమేషన్ స్లిప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇందులో సీటు అలాట్మెంట్ను ఖరారు చేసేందుకు అవసరమైన తదుపరి దశల వివరాలు ఉంటాయి. ఇలా సీటు అలాట్మెంట్ స్లిప్ డౌన్ లోడ్ చేసుకున్న తరువాత స్టెప్1 లో పొందిన సీటును ఆమోదించాలి ఆ తర్వాత ఫ్రీజ్, స్లైడ్, ఫ్లోట్ ఆప్షన్లలో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాలి.
ఫ్రీజ్: అభ్యర్థి తొలి ఆప్షన్స్ లో పేర్కొన్న సీటు లభిస్తే తప్పనిసరిగా ఫ్రీజ్ ను ఎంచుకోవాలి. దాంతో అభ్యర్థి తనకు లభించిన సీటును ఆమోదించినట్లు పరిగణిస్తాను, సదరు అభ్యర్థికి తదుపరి దశల కౌన్సిలింగ్ ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉండదు.
ఫ్లోట్: మొదటగా పెట్టిన ఆప్షన్ లలో పేర్కొన్న సీటు పొందని అభ్యర్థులకు మాత్రమే తదుపరి రౌండులో పాల్గొనేందుకు ఆవకాశం ఉంటుంది. వీరు ఫ్లోట్ ఆప్షన్ ఎంచుకుంటే లభించిన సీటును అంగీకరణ అంగీకరిస్తూనే, మరింత మెరుగైన ఇన్స్టిట్యూట్లో చేరే అవకాశం కోసం తదుపరి దశల కౌన్సిలింగ్ లో పాల్గొనేందుకు వీలు కల్పిస్తారు. ఒకవేళ తదుపరి దశలో కూడా మెరుగైన ఇన్స్టిట్యూట్లో సీటు రాకపోతే ప్రస్థుతం ఉన్న ఇన్స్టిట్యూట్ లోనే కొనసాగించుకోవచ్చు.
స్లైడ్: స్లైడ్ ఆప్షన్ ఇచ్చిన విద్యార్థులు ప్రస్తుతం సీటు లభించిన ఇన్స్టిట్యూట్ కు ఆమోదం తెలుపుతూనే తదుపరి రౌండ్స్ లో అదే ఇన్స్టిట్యూట్లో మరింత మెరుగు ప్రోగ్రాం లో అవకాశం వేస్తే చేరేందుకు వీలుంటుంది.
అదే విధంగా చివరి రౌండ్ లో ఫ్లోట్, స్లైడ్ ఆప్షన్స్ కు వీలు ఉండదు. అంటే చివరి రౌండ్ తప్ప మిగతా అన్ని రౌండ్లలోను అభ్యర్థులు ఫ్లోట్ నుంచి స్లైడ్, ఫ్రీజ్ కు అదే విధంగా స్లైడ్ నుంచి ఫ్రీజ్ కు ఆప్షన్లు మార్చుకొనేందుకు అవకాశం ఉంటుంది.
డాక్యుమెంట్ వెరిఫికేషన్
స్టేజ్2లో అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ ను జోసా పోర్టల్ లో అప్లోడ్ చేయాలి. అనంతరం సీటు యాక్సెప్ట్ న్స్ ఫీజును చెల్లించాలి. ఈ ఫీజు చెల్లించిన అభ్యర్థుల డాక్యుమెంట్లు మాత్రమే పరిశీలిస్తారు. డాక్యుమెంట్లను పరిశీలిస్తున్న అధికారులు అడిగే ప్రశ్నలకు నిర్దేశిత గడువులోపు సమాధానం ఇవ్వకుంటే సీటు రద్దు అవడంతో పాటు తదుపరి దశల కౌన్సెలింగ్ లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఉంది.
Follow for more Daily Updates
ప్రోవిషనల్ అలాట్మెంట్ లెటర్
జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్ లో ర్యాంకు పొందిన అభ్యర్థులు రిజర్వేషన్ కేటగిరీ, అభ్యర్థులు పేర్కొన్న ఆప్షన్లు, అందుబాటులో ఉన్న సీట్లను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థి డాక్యుమెంట్లను సైతం పరిశీలించిన తరువాత నిర్దేశిత అన్ని అర్హతలు సంతృప్తిగా ఉన్నట్లయితే ప్రొవిజినల్ సీట్ అలాట్మెంట్ లెటర్ ను జోసా పోర్టల్ లో అందుబాటులో ఉంచుతారు. దీన్ని అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
అన్ని రౌండ్ల జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రొవిజినల్ సీట్ అలాట్మెంట్ పొందిన అభ్యర్థులు తమకు సీటు లభించిన ఇన్స్టిట్యూట్లో నిర్దేశిత గడవులోపు వ్యక్తిగతంగా రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ అడ్మిషన్ కు సంబంధించిన అన్ని ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుంది.
JOSA Website
SSC Jobs 2025 Calendar
Important Note:
ఫ్రెండ్స్ మన website అయిన Daily Updates లో ప్రతిరోజూ ముఖ్యమైన Job and Educational Updates ఇస్తాం. కావున ప్రతి ఒక్కరు మన website ని రోజు Visit చేసి మీకు అర్హతలు ఉన్న Jobs మరియు Education కి సంబంధించిన వాటి గురించి తెలుసుకొని Apply చేసుకోండి.