CDSE 2025 నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది
హలో ఫ్రెండ్స్… CDSE 2025 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
రక్షణ రంగంలో ఉద్యోగాలు ఆశించేవారు, సాధారణంగా డిగ్రీలో అత్యున్నతమైన ఉద్యోగం పొందాలనుకునేవారు రాయాల్సిన ముఖ్యమైన పరీక్ష CDSE 2025 ఒకటి. ఇందులో విజయం సాధించిన వారు ప్రతి నెలా స్టైపెండ్ అందుకుంటూ శిక్షణ పొందవచ్చు. ఆ తరువాత లెవెల్ 10 హోదాతో ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ లో విధులు నిర్వహించవచ్చు.
యూనియన్ పభ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సంవత్సరానికి రెండు సార్లు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ ను నిర్వహిస్తుంది. పెళ్లి కానీ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. నీబద్ధతతో కృషి చేస్తే కొద్ది ప్రయత్నంలోనే విజయాన్ని అందుకోవచ్చు. ఇంతకు ముందు ఫలితాల ప్రకారంగా పరీక్ష, ఇంటర్వ్యూలలో 45 శాతం మార్కులు సాధించిన వారు తప్పనిసరిగా ఏదో ఒక సర్వీస్ కి ఎంపిక అవుతున్నారు. ఆయితే దీనికి సంబందించిన మొత్తం ఖాళీల వివరాలు ఇప్పుడు చూద్దాం. మొత్తం 453 ఖాళీలు ఉన్నాయి, విభాగాల వారీగా ఐఎంఏ లో 100 ఖాళీలు, ఐఎన్ఎ లో 26 ఖాళీలు, ఏఎఫ్ఏ లో 32 ఖాళీలు, ఓటిఏ మెన్ 276 ఖాళీలు మరియు ఓటిఏ విమెన్ 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
Educational Qualification
మిలటరీ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు ఏదైనా డిగ్రీ చాలు. నేవల్ అకాడమీ ఉద్యోగులకు బీటెక్ అవసరం. ఎయిర్ ఫోర్స్ పోస్టులకు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు ఇంటర్ లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివి ఉండాలి. వీటిలో సెలక్ట్ అయ్యేందుకు పరీక్ష లో మెరిట్ సాధించిన వారు, తరువాత ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులు సాధించినా వారి ఆధారంగా సెలెక్షన్ చేస్తారు.
Follow for more Daily Updates
Age
ఆయితే దీనికి సంబందించిన వయసు వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇండియన్ మిలటరీ అకాడమీకి నేవల్ అకాడమీలకు జూలై 2, 2002 నుండి జూలై 1, 2007 మధ్య లో జన్మించిన ఉన్నవారు CDSE 2025 కి అర్హులు, ఎయిర్ ఫోర్స్ అకాడమీ పోస్టులకు జూలై 2, నుంచి జూలై 1, 2006 మధ్యలో జన్మించిన వారు అర్హులు, కమర్షియల్ పైలెట్ లైసెన్స్ ఉన్నవారికి గరిష్ట వయసులో రెండేళ్ల వయస్సు సడలింపు వర్తిస్తుంది. ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు జూలై 2, 2001 నుండి జూలై 1 2007, మధ్య జన్మించిన వారు అర్హులు కాగలరు.
Application Fee
ఆయితే ఇప్పటికే CDSE 2025 కి సంబందించిన ఆన్ లైన్ దరఖాస్తులు మొదలయ్యాయి దీనికి చివరి తేదీ వచ్చేసి జూన్ 17, 2025. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మహిళలకు ఎస్సీ, ఎస్టీ లకు ఫీజు లేదు మరియు ఇతర కేటగిరీ వారికి 200 రూపాయలు.
పరీక్ష నిర్వహించే తేదీ సెప్టెంబర్ 14, 2025. అప్లై చేసుకొనుటకు ఈ క్రింది ఇచ్చిన లింకును క్లిక్ చేయండి:
Apply
Exam Pattern
పేపర్ కి 100 మార్కులు చొప్పున ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ విభాగాల్లో ప్రశ్నాపత్రాలు ఉంటాయి. ఒక్కో పేపర్ కు వ్యవధి రెండు గంటల సమయం ఉంటుంది. మ్యాథ్స్ లో 100, మిగిలిన రెండు పేపర్లలో ను 120 చొప్పున ఆబ్జెక్ట్ వ్ ప్రశ్నలు వస్తాయి. సమాధానం తప్పు ఆయితే ప్రశ్నకు కేటాయించి మార్కులు లో ⅓ వంతు నెగిటివ్ మార్క్ తగ్గిస్తారు. పరీక్షల్లో అర్హతకు ప్రతి పేపర్లలోను కనీస మార్కులు 20 లేదా 25 శాతం మార్కులు పొందాలి. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పోస్టుల కే దరఖాస్తు చేసుకున్న వారు మ్యాథ్స్ పేపర్ రాయనవసరం లేదు. అర్హత మార్కులు పొంది మెరిట్ లో ఉన్న వారిని ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు.
Interview
CDSE 2025 పరీక్ష లో ఉత్తీర్ణుత సాధించినా వారు పరీక్ష తో సమానంగా ఇంటర్వ్యూ విభాగానికి 300 మార్కులు ఉన్నాయి. ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకే దరఖాస్తు చేసుకున్న వారికి ఇది 200 మార్కులకు ఉంటుంది. ఐదు రోజుల పాటు కొనసాగే ముఖాముఖిలో రెండు దశలుంటాయి. మొదటి దశలో అర్హత సాధిస్తేనే రెండో దశకి చేరుకొనే అనుమతిస్తారు. ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులైన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, పరీక్ష మరియు ఇంటర్వ్యూల మార్కులు ఆధారంగా మెరిట్ సాధించిన వారిని శిక్షణలోకి తీసుకుంటారు.
Training
ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ, ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వీటిలో ఏ విభాగంలో చేరినప్పటికీ శిక్షణ వ్యవధిలో ప్రతి నెల 56,100 రూపాయలు స్టైపెండ్ గా చెల్లిస్తారు. మిలటరీ అకాడమీ కి ఎంపికైన వాళ్ళకు, ఇండియన్ మిలటరీ అకాడమీ డెహ్రాడూన్ లో 18 నెలల పాటు శిక్షణ ఉంటుంది. నేవల్ అకాడమీ లో చేరిన వాళ్ళకు సుమారు 18 నెలల పాటు కేరళలోని ఎజిమాలలో శిక్షణ నిర్వహిస్తారు. ఎయిర్లో ఫోర్స్ అకాడమీకి ఎంపికైన వారికి 18 నెలల పాటు పైలట్ శిక్షణ బీదర్, ఎలహంక, హకీంపేటలో ఉంటుంది. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు ఎంపికైన వారు చెన్నైలో 11 నెలలు పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తారు.
Job salary
శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం ఆర్మీ, ఓటీఏ లో లెఫ్టినెంట్, నేవీలో సబ్ లెఫ్టినెంట్ ఎయిర్లో ఫోర్సు లో ఫ్లయింగ్ ఆఫీసర్ హోదాతో ఉద్యోగంలో చేరతారు. పేర్లలో తేడాలు ఉన్నప్పటికి ఈ మూడు సమాన హోదా ఉద్యోగాలే. వీరికి 56,100 రూపాయలు జీతం లభిస్తుంది మరియు మిలటరీ సర్వీస్ పే కింద అదనంగా 15,500 చెల్లిస్తారు. పైలట్లకు 25వేల రూపాయలు ఫ్లయింగ్ ఎలివేన్సులు అందుతుంది. డిఏ, హెచ్ఆర్ఏ, ప్రోత్సాహకాలతో మొదటి నెల నుంచి లక్ష రూపాయలు పైగా వేతనం అందుకోవచ్చు. తక్కువ వ్యవధి లోనే అత్యున్నతమైన స్థాయికి చేరుకోవచ్చు. భవిష్యత్తులో సంబంధిత విభాగాలకు అత్యున్నతమైన అధికారిగా, త్రివిధ దళాలకు అధికారి కావచ్చును.
Follow for more Daily Updates
UGC NET 2025 Exam Dates
Important Note:
ఫ్రెండ్స్ మన website అయిన Daily Updates లో ప్రతిరోజూ ముఖ్యమైన Job and Educational Updates ఇస్తాం. కావున ప్రతి ఒక్కరు మన website ని రోజు Visit చేసి మీకు అర్హతలు ఉన్న Jobs మరియు Education కి సంబంధించిన వాటి గురించి తెలుసుకొని Apply చేసుకోండి.
1 thought on “CDSE 2025 నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది | Indian Army Jobs 2025”