CSIR UGC NET 2025 కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల…
హలో ఫ్రెండ్స్….. సైన్స్ లో బోధించడానికి మరియు పరిశోధనలకు మార్గం అయిన CSIR UGC NET 2025 కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
సైన్స్ లో బోధన, పరిశోధనలకు ఆవకాశం కల్పించే CSIR UGC NET 2025 నోటిఫికేషన్ విడుదలైంది. నేషన్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షను నిర్వహించనుంది. ఆయితే ఈ పరీక్షను ఆన్ లైన్ పద్ధతిలో నిర్వహిస్తారు. పరీక్ష లో ప్రతిభ చూపితే పరిశోధనలకు వీలు కల్పించే జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ పొందవచ్చును. అంతేకాకుండా పిహెచ్ డీ అడ్మిషన్ తో పాటు కాలేజీ లెవెల్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరేందుకు ఆవకాశం లభిస్తుంది. ఈ నేపథ్యంలో CSIR UGC NET 2025తో ప్రయోజనాలు, దరఖాస్తుకు అర్హతలు, పరీక్ష విధానం తదితర వివరాలను ఇప్పుడు చూద్దాం. అయితే ఈ కౌన్సిల్ ఆఫ్ సైంటిస్ట్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ యుజిసి(CSIR) పరీక్ష ద్వారా జేఆర్ఎఫ్ కు ఎంపికతో పాటు పీహెచ్డీ లో ప్రవేశాలకు, అసిస్టెంట్ ప్రొఫెసర్ అనియామకానికి అర్హతలను ఎంపిక చేస్తారు. ఆయితే ఈ పరీక్షను సంవత్సరానికి రెండు సార్లు నిర్వహిస్తారు.
Selection Process
జెఆర్ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం, పిహెచ్ డి అడ్మిషన్ కు సంబంధించిన ఎంతమంది అభ్యర్థులను ఎంపిక చేయాలో ఫలితాల కమిటీ నిర్ణయిస్తుంది. CSIR UGC NET 2025 ఫలితాలను నార్మలైజ్డ్ మార్కులతో పాటు పర్సంటైల్ విధానంలో ప్రకటిస్తారు. పరీక్షను ఒకటి కంటే ఎక్కువ షిఫ్ట్ ల్లో నిర్వహిస్తున్న నేపథ్యంలో నార్మలైజేషన్ ప్రక్రియను అనుసరిస్తారు. జెఆర్ఎఫ్ కి ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూని నిర్వహించి పీహెచ్డీ లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇందులో నెట్ మార్కులకు 70% వెయిటేజ్ ఉంటుంది, అదే విధంగా ఇంటర్వ్యూకు 30 శాతం వెయిటేజీ ఉంటుంది. పీహెచ్డీ లో ప్రవేశానికి సంబంధించి నెట్ స్కోర్ కు ఒక ఏడాది పాటు వ్యాలిడిటీ ఉంటుంది. సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ లో మూడు కేటగిరీలుగా సెలెక్షన్ ప్రక్రియను నిర్వహిస్తారు.
Three Catogaries
కేటగిరి 1 ‘అవార్డు ఇఫ్ జేఆర్ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం’, కేటగిరి 2 అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం, పీహెచ్డీలో ప్రవేశం కేటగిరీ 3 పీహెచ్డీ లో ప్రవేశం దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తమ కేటగిరీని పేర్కొనాల్సి ఉంటుంది. క్యాటగిరీ 1 లో అర్హత సాధించిన వారికి జిఆర్ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్, పిహెచ్డి లోకి ప్రవేశం పొందేందుకు అర్హత దక్కుతుంది. అదే విధంగా కేటగిరీ 2లో అర్హత సాధించిన వారికి అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం, పీహెచ్డీ లో ప్రవేశానికి అవకాశం ఉంటుంది. అలాగే కేటగిరీ 3 లో అర్హత సాధించిన అభ్యర్థులకు పిహెచ్ డీలో ప్రవేశం పొందేందుకు మాత్రమే వీలు కల్పిస్తారు.
Follow for more Daily Updates
Exam Pattern
CSIR UGC NET 2025 లో మొత్తం 200 మార్కులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానం లో జరుగుతుందని.
ఈ పరీక్ష లో మల్టిపుల్ ఛాయిస్ కొస్షన్స్ ఉంటాయి. ప్రశ్న పత్రం ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుంది. పరీక్ష వ్యవధి మొత్తం మూడు గంటల పాటు జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ నిబంధన కూడా ఉంది. ఆయితే ఈ పరిక్షకు సంబందించిన ప్రశ్నా పత్రం మూడు విభాగాలు, పార్ట్ ఏ పార్ట్ బీ పార్ట్ సీ గా నియమించారు.
అయితే పార్ట్ ఏ లో జనరల్ ఆప్టిట్యూడ్ విభాగం అందరికీ కామన్ గా ఉంటుంది. అందులో లాజికల్ రీజనింగ్, గ్రాఫికల్ అనాలసిస్, అనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ కంపారిజన్, సిరీస్ ఫార్మేషన్, పజిల్స్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. పార్టీ ఏలో అడిగే 20 ప్రశ్నల్లో 15 ప్రశ్నలకు సమాధానాలు గుర్తిస్తే సరిపోతుంది. ఇందులో ప్రతి సరైన సమాధానానికి రెండు మార్కులు కేటాయిస్తారు. అదేవిధంగా ప్రతి పొరపాటు సమాధానానికి అర మార్కు నెగిటివ్ చేస్తారు.
పార్ట్ బి లో సంబంధించిన సబ్జెక్టు పై ఆబ్జెక్ట్వ్ తరహా లో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ఇవి సాధారణంగా ఇచ్చిన సిలబస్ నుంచే ఉంటాయి.
పార్ట్ సిలో సబ్జెక్టు సంబంధిత ఉన్నత స్థాయి ప్రశ్నలు అడుగుతారు. ఇవి సదరు సబ్జెక్టులో అభ్యర్థికున్న లోతైన నైపుణ్యాన్ని పరిశీలించేలా ఉంటాయి. అభ్యర్థి విశ్లేషణ సామర్థ్యంతో పాటు అప్లికేషన్ ఓరియంటేషన్ను సైతం పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు.
ఆసలు ఈ పరీక్షను మొత్తం ఐదు విభాగాల్లో CSIR UGC NET 2025 పరీక్షను నిర్వహించనున్నారు. అవి ఏం అనగా కెమికల్ సైన్సెస్, ఎర్త్ సైన్సెస్, అట్మాస్పియరిక్ సైన్సెస్, ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ ఈ విభాగాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
Qualification
ఆయితే ఈ పరీక్షకు సంబంధించిన అర్హత కోసం ఆయా విభాగాల్లో కనీసం 55% మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. ఎస్సీ లేదా ఎస్టీ, ఓబీసీ(నాన్ క్రీమీలేయర్) తదితర రిజర్వేషన్ వర్గాలకు చెందిన అభ్యర్థులు మాస్టర్స్ డిగ్రీలో కనీసం 50% మార్కులు పొంది ఉండాలి. అలాగే దీనికి సంబందించిన దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి జూన్ 23. ఆలాగే పరీక్షలు జూలై లో 26, 27, 28 తేదీలలో నిర్వహిస్తారు.
Age
వయసుకు సంబంధించిన వివరాలను తెలుసుకుందాం. జులై 1 2025 నాటికి జేఆర్ఎఫ్ అభ్యర్థులకు 30 ఏళ్లకు మించకుడదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ(నాన్ క్రీమీలేయర్) తదితర రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్ల వయసు సడలింపు లభిస్తుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం, పిహెచ్ డీ అభ్యర్థులకు ఎలాంటి గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.
Stipend
ఈ పరీక్షలలో సెలెక్ట్ అయినా తరువాత జెఆర్ఎఫ్ కు ఎంపికైన వారికి మొదటి రెండేళ్లు నెలకి 37వేల రూపాయలు స్టైపెండ్ లభిస్తుంది. దీంతోపాటు ఏడాదికి 20వేల రూపాయలు అత్యవసర గ్రాంట్ ను కూడా అందజేస్తారు. జేఆర్ఎఫ్ అభ్యర్థిని పరిశోధన తీరును ముగ్గురు సభ్యులు కమిటీ నిరంతరం పర్యవేక్షిస్తుంటుంది. రెండేళ్ల జేఆర్ఎఫ్ అనంతరం అభ్యర్థి పీహెచ్ డికి నమోదు చేసుకుంటే ఎస్ఆర్ఎఫ్(సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్)కు సెలెక్ట్ చేస్తారు. ఎస్ఆర్ఎఫ్ కు ఎంపికైన వారికి మూడో ఏడాది నుంచి ప్రతి నెల 42 వేల రూపాయలు చెల్లిస్తారు. అదేవిధంగా సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులు ఆయా యూనివర్సిటీలు విడుదల చేసే నోటిఫికేషన్ ను అనుసరించి పీహెచ్డీకి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ కు అర్హత పొందిన వారు యూజీసీ నిబంధనలకు అనుగుణంగా కాలేజీలు, యూనివర్సిటీల్లో బోధన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
CDSE 2025 Notification Released
Follow for more Daily Updates
Jobs
Important Note:
ఫ్రెండ్స్ మన website అయిన Daily Updates లో ప్రతిరోజూ ముఖ్యమైన Job and Educational Updates ఇస్తాం. కావున ప్రతి ఒక్కరు మన website ని రోజు Visit చేసి మీకు అర్హతలు ఉన్న Jobs మరియు Education కి సంబంధించిన వాటి గురించి తెలుసుకొని Apply చేసుకోండి.
1 thought on “CSIR UGC NET 2025 కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల… | Entrance Exams 2025”