Sbi Clerk Notification 2025
SBI Clerk 2025 జూనియర్ అసోసియేట్ (క్లర్క్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న ఎసీబీఐ శాఖల్లో 6,589 పోస్టులను భర్తీ చేయనున్నది.

Follow for more Daily Updates
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 6589 జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) ఖాళీల నియామకానికి SBI Clerk 2025 PDF ని విడుదల చేసింది. అధికారిక ప్రకటన (CRPD/CR/2025-26/06) ఆగస్టు 5, 2025న SBI కెరీర్ పోర్టల్‌లో sbi.co.in/web/careersలో ప్రచురించబడింది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 6 నుండి ఆగస్టు 26, 2025 వరకు ఆన్లైన్లో నమోదు చేసుకుని దరఖాస్తు రుసుము చెల్లించవచ్చు. దరఖాస్తుదారులు ఒక రాష్ట్రం/UTలో ఖాళీలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి మరియు ఎంచుకున్న ప్రాంతంలోని పేర్కొన్న స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి.
SBI Clerk 2025 Notification – Click Here
Total Posts
SBI Clerk 2025 పోస్టుల సంఖ్య 6,389. జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్- రెగ్యులర్) 5180, జూనియర్ అసోసియేట్స్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ -బ్యాక్ లాగ్) 1409 తెలంగాణ రాష్ట్రం లో 250 (ఎస్సీ 40, ఎస్టీ 17, ఓబీసీ 67, ఈడబ్ల్యూఏ స్ 25, జనరల్ 101), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 310 ఎస్సీ 49, ఎస్టీ 21, ఓబీసీ 83, ఈడబ్ల్యూఎస్ 31, జనరల్ 126).
Application Process
SBI Clerk 2025 కి దరఖాస్తు చేసుకోవడానికి ఇష్టపడే అభ్యర్థులు తమ దరఖాస్తులను అధికారిక SBI కెరీర్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో సమర్పించాలి. ఇతర దరఖాస్తు విధానాలు ఆమోదించబడవు. SBI Clerk 2025 దరఖాస్తు ఫారమ్ ని పూరించేటప్పుడు అన్ని సూచనలను జాగ్రత్తగా పాటించడం మరియు ఆన్లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు రుసుము చెల్లింపును నిర్ధారించుకోవడం ముఖ్యం.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్‌మెన్, డీఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు లేదు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు .750.
Registration Process
చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ ID & మొబైల్ నంబర్‌తో నమోదు చేసుకోండి. ఫలితాల ప్రకటన వరకు వాటిని యాక్టివ్‌గా ఉంచండి.
Document Scanning
సూచించిన మార్గదర్శకాల ప్రకారం ఫోటోగ్రాఫ్, సంతకం, ఎడమ బొటనవేలు ముద్ర & చేతితో రాసిన డిక్లరేషన్‌ను స్కాన్ చేయండి.
Application Form Filling
వ్యక్తిగత, విద్యా & కమ్యూనికేషన్ వివరాలను జాగ్రత్తగా పూరించండి. తుది సమర్పణకు ముందు సేవ్ చేసి తిరిగి సవరించండి (గరిష్టంగా 3 సార్లు).
Fee Payment
ఇంటిగ్రేటెడ్ పేమెంట్ గేట్‌వే ద్వారా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించండి. లావాదేవీ ఛార్జీలు అభ్యర్థులు భరించాలి.
E-Receipt & Application Printout
చెల్లింపు విజయవంతంగా పూర్తయిన తర్వాత, ఇ-రసీదు మరియు నింపిన దరఖాస్తు ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకోండి. ప్రింటవుట్‌ను SBI కి పంపాల్సిన అవసరం లేదు.

Follow for more Daily Updates
Eligibility Criteria
ఎలిజిబిలిటీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ.. నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. కనిష్ట వయోపరిమితి 20 ఏండ్లు. గరిష్ట వయోపరిమితి 28 ఏండ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీడబ్ల్యూ బీడీ అభ్య ర్థులకు 10 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. వితంతు, విడాకులు, చట్టబద్ధంగా వేరుపడిన మహిళలకు గరిష్ట వయోపరిమితి జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 35 ఏండ్లు, ఓబీసీలకు 38 ఏండ్లు, ఎస్సీ, ఎస్టీలకు 40 ఏండ్ల వరకు ఉంటుంది.
ఎస్ బీఐ ట్రెయిన్డ్ అప్రెంటీస్ అభ్యర్థులకు జనరల్ /ఈడబ్ల్యూఎస్ ఏడాది, ఓబీసీలకు నాలుగేండ్లు, ఎస్సీ, ఎస్టీ ఆరేండ్లు, పీడబ్ల్యూబీడీ (జనరల్/ ఈడ బ్ల్యూఎస్) 11 ఏండ్లు, పీడబ్ల్యూబీడీ (ఓబీసీ) 14 ఏండ్లు, పీడబ్ల్యూబీడీ(ఎస్సీ/ఎస్టీ) 16 ఏండ్లు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
Selection Process
రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష రెండు దశల్లో ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ రెండు ఎగ్జామ్స్ కూడా అబ్జెక్టివ్ విధానంలో ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తారు. ఆన్లైన్ ప్రిలిమినరీ క్వాలిఫై అయిన అభ్యర్థులను మెయిన్ ఎగ్జామ్క షార్ట్ లిస్ట్ చేస్తారు. మెయిన్ తర్వాత తాత్కాలిక కేటాయింపునకు ముందు. లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ నిర్వహిస్తారు.
SBI Clerk 2025 Prelims
Sbi Clerk Notification 2025 క్వాలిఫై ఎగ్జామ్ మాత్రమే. ఇందులో వచ్చిన మార్కులు తుది ఎంపికలో పరిగణన లోకి తీసుకోరు. ప్రిలిమినరీ ఎగ్జామ్ అబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి. 100 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు సెక్షన్-1లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్ర శ్నలు 30 మార్కులకు, సెక్షన్-2లో న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు 35 మార్కులకు, సెక్షన్-3 లో రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు 35 మార్కులకు మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి సెక్షన్‌కు 20 నిమిషాల సమయం ఇస్తారు. ఒక గంటలో ఎగ్జామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది.. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. ఎలాంటి సమాధానాన్ని గుర్తించకుండా వదిలిన ప్రశ్నలకు మార్కుల కోత ఉండదు. అభ్యర్థులు మెయిన్ కు అర్హత సాధించాలంటే కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది.
SBI Clerk Salary
SBI క్లర్క్ జీతం 2025 రూ. 26,730 ప్రాథమిక వేతనంతో ప్రారంభమవుతుంది, ఇందులో గ్రాడ్యుయేట్లకు రెండు ముందస్తు ఇంక్రిమెంట్లు ఉంటాయి. మొత్తం జీత స్కేల్ రూ. 24,050 నుండి రూ. 64,480 వరకు ఉంటుంది, సర్వీస్ సంవత్సరాల ఆధారంగా రెగ్యులర్ ఇంక్రిమెంట్లు ఉంటాయి. ప్రాథమిక జీతంతో పాటు, క్లర్కులు డియర్నెస్ అలవెన్స్ (DA), ఇంటి అద్దె అలవెన్స్ (HRA) మరియు ఇతర ప్రయోజనాలను పొందుతారు. SBI క్లర్క్ ప్రారంభ జీతం నెలకు సుమారు రూ. 46,000, స్థానం మరియు అలవెన్సులను బట్టి ఉంటుంది. SBI క్లర్క్ పోస్ట్ స్థిరమైన జీత నిర్మాణాన్ని మరియు కెరీర్ వృద్ధికి అవకాశాలను అందిస్తుంది.
Language Test
లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ మెయిన్స్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులను ఉదోగానికి తాత్కాలికంగా ఎంపిక చేస్తారు. వీరిలో పదో తరగతి లేదా 12వ తరగతిలో రాష్ట్రంలో పేర్కొన్న స్థానిక భాషను అభ్యసించని వారు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్(ఎల్ఎల్పీటీ) రాయాల్సి ఉంటుంది. ఇందులో రెండు సెక్షన్లు ఉంటాయి. 50 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. సెక్షన్-1లో నాన్ వర్బల్ లో ఆబ్జెక్టిన్ మూడు ప్యాసేజ్‌లు 15 మార్కులకు, సబ్జెక్టివ్ మూడు ప్యాసేజ్ లు 15 మార్కులకు సెక్షన్-2లో వర్సల్ టెస్ట్ 20 మార్కులకు ఉంటుంది, ప్రతి అభ్యర్థి కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 5 శాతం మార్కులు సడలింపు ఉంటుంది.
IB Security Assistant Jobs
Follow Instagram Page
Important Note:
ఫ్రెండ్స్ మన website అయిన Daily Updates లో ప్రతిరోజూ ముఖ్యమైన Job and Educational Updates ఇస్తాం. కావున ప్రతి ఒక్కరు మన website ని రోజు Visit చేసి మీకు అర్హతలు ఉన్న Jobs మరియు Education కి సంబంధించిన వాటి గురించి తెలుసుకొని Apply చేసుకోండి.
1 thought on “SBI Clerk 2025 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది | Sbi Clerk Notification 2025”